రాచకొండ కమిషనరేట్ ప్రహరీ గోడ పనులకు భూమిపూజ

 రాచకొండ కమిషనరేట్ నిర్మాణంలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణ పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చామకూర మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, యాదాద్రి భువనగిరి జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, ఎండీ మల్లారెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ తదితరులు హాజరయ్యారు.