బ్యాటింగ్ సంచలనం మయాంక్ అగర్వాల్ దుమ్మురేపుతున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో పరుగుల వరద పారించిన అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మెహదీ హసన్ వేసిన 99వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాది ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. సుధీర్ఘ ఇన్నింగ్స్‌లో 25 బౌండరీలు, 5సిక్సర్లు బాదడం విశేషం. కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు డబుల్ సెంచరీలు కొట్టడం విశేషం. వన్డే తరహాలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. నిలకడగా ఆడుతూ బంగ్లా బౌలర్లను ఉతికారేస్తున్నాడు. 28ఏండ్ల మయాంక్ వీరవిహారం చేయడంతో భారత్ ఆధిక్యం 200 దాటింది. 37 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన అగర్వాల్ తొలి సెషన్ చాలా నిదానంగా ఆడాడు. సెంచరీ పూర్తైన తర్వాత వేగం పెంచాడు. 107 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసింది. ప్రస్తుతం అగర్వాల్(237), రవీంద్ర జడేజా(38) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 276 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ జోడీని విడదీసేందుకు బంగ్లా బౌలర్లు శ్రమిస్తున్నారు.
మయాంక్ అ'ద్వితీయ' శతకం